Yemen: ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట.. 85 మందికిపైగా మృతి

Yemen: రంజాన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఘటన

Update: 2023-04-20 05:07 GMT

Yemen: ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట.. 85 మందికిపైగా మృతి

Yemen: యెమెన్‌ దేశంలో ‍ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ దేశ రాజధాని సనాలో రంజాన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఘటనలో 85 మందికిపైగా మృతి చెందగా.. 322 మందికిపైగా గాయపడ్డారు. హౌతీ ఆధ్వర్యంలోని ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపిన వివరాల ప్రకారం.. ఓల్డ్ సిటీలో వందలాది మంది పేదల కోసం.. వ్యాపారులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వందలాదిమంది గుమిగూడడంతో తొక్కిసలాట జరిగింది. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News