దక్షిణ ఆసియాలో క్రమంగా పెరుగుతోన్న కరోనా వ్యాప్తి.. ఈ దేశాల్లో తక్కువే అయినా..

దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.. మిగతా దేశాల్లో మాత్రం కేసులు వందల సంఖ్యకు పరిమితం అయ్యాయి.

Update: 2020-04-13 13:23 GMT
Coronavirus

దక్షిణ ఆసియాలో ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో కరోనావైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.. మిగతా దేశాల్లో మాత్రం కేసులు వందల సంఖ్యకు పరిమితం అయ్యాయి.భారత్, పాక్ దేశాల్లో ముఖ్యంగా కేసులు పెరగడానికి ప్రధాన కారణం ఇరాన్, తబ్లిఘి జమాత్ లే కారణంగా నిలిచాయి.. ఇరాన్ నుంచి పాక్ కు వేలాదిమంది ప్రయాణ చరిత్ర కలిగివుండటం మూలాన అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

మరోవైపు భారత్ లో మాత్రం ఢిల్లీలో జరిగిన తబ్లిఘి జమాత్ కారణంగా కేసులు పెరిగినట్టు అధికారిక ప్రభుత్వ గణాంకాలు చూస్తే అర్ధమవుతోంది.. శ్రీలంక , బంగ్లాదేశ్, మాల్దీవులు , నేపాల్ దేశాలలో సంక్రమణ రేట్లు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కరోనావైరస్ భయం మాత్రం ఆవహించింది.

ఆయా దక్షిణాసియా దేశాల్లో కరోనా కేసులు, మరణాలు ఇలా ఉన్నాయి.. భారతదేశంలో 9,152 కేసులు నమోదయ్యాయి, వాటిలో 308 మరణాలు ఉన్నాయి.. పాకిస్తాన్‌లో 5,374 కేసులు నమోదయ్యాయి, వాటిలో 93 మరణాలు ఉన్నాయి.. బంగ్లాదేశ్‌లో 621 కేసులు నమోదయ్యాయి, వాటిలో 34 మరణాలు ఉన్నాయి.

ఆఫ్ఘనిస్తాన్‌లో 607 కేసులు నమోదయ్యాయి.. 607 కేసులు ఉన్నాయి.. శ్రీలంకలో 203 కేసులు నమోదయ్యాయి.. వాటిలో 7 మరణాలు ఉన్నాయి.. మాల్దీవుల్లో 20 కేసులు ఉన్నాయి కానీ ఇక్కడ ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. అలాగే 12 కేసులు ఉన్న నేపాల్‌లో ఐదు కేసులు ఉన్న భూటాన్‌లో కూడా ఒక్క మరణం కూడా నమోదు కాలేదు.

REJOINDER

ఈ ఆర్టికల్ కు తొలుత ఉపయోగించిన ఇమేజిలో పొరపాటు దొర్లినది. ఇమేజి సెలక్ట్ చేసుకోవడంలో జరిగిన పొరపాటు ఇది. అనుకోకుండా జరిగిన పొరపాటుకు చింతిస్తున్నాము. ఆ ఆర్టికల్ నుంచి ఆ ఇమేజిలు తొలగించడం జరిగింది. ఇటువంటి పొరపాట్లు మరోసారి దొర్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అందరికీ తెలియచేసుకుంటున్నాము.


Tags:    

Similar News