అగ్రరాజ్యం సంచలన నిర్ణయం: అమెరికా మ్యాప్‌లో PoK మనదే.. పాకిస్థాన్ గొంతులో వెలక్కాయ!
US Map Shows PoK as Part of India: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది.
US Map Shows PoK as Part of India: అంతర్జాతీయ వేదికపై పాకిస్థాన్‌కు అమెరికా గట్టి దౌత్యపరమైన షాక్ ఇచ్చింది. జమ్మూకశ్మీర్ విషయంలో భారత్ వాదనకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ కార్యాలయం (USTR) తాజాగా విడుదల చేసిన భారత అధికారిక మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా మొత్తం జమ్మూకశ్మీర్‌ను భారత్ భూభాగంగానే స్పష్టంగా చూపించింది.
భారత్-అమెరికా వాణిజ్య ఒప్పంద ఫ్రేమ్‌వర్క్‌ను వివరిస్తూ విడుదల చేసిన ఒక గ్రాఫిక్‌లో ఈ మ్యాప్‌ను ఉపయోగించారు. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్‌లో తమకు అనుకూలంగా లాబీయింగ్ చేస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం ఇస్లామాబాద్‌కు మింగుడుపడని విషయంగా మారింది. పాక్ దశాబ్దాలుగా చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని అగ్రరాజ్యం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఈ చర్యతో స్పష్టమైంది.
మ్యాప్ వివాదమే కాకుండా, ఇరు దేశాల మధ్య వాణిజ్య పరంగా చారిత్రాత్మక ఒప్పందాలు కుదిరాయి:
భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై సుంకాలను అమెరికా 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. అలాగే అదనంగా ఉన్న 25 శాతం సుంకాన్ని ఉపసంహరించుకోవడానికి వాషింగ్టన్ అంగీకరించింది.
ప్రతిగా అమెరికా నుంచి వచ్చే పలు ఉత్పత్తులపై భారత్ కూడా సుంకాలను తగ్గించనుంది.
పాకిస్థాన్‌తో సైనిక సంబంధాలు ఉన్నప్పటికీ, భారత్‌తో ఉన్న వ్యూహాత్మక మరియు ఆర్థిక బంధానికే అమెరికా పెద్దపీట వేస్తోంది.
ప్రపంచ రాజకీయాల్లో భారత్‌కు ప్రత్యామ్నాయం లేదని అమెరికా ఈ మ్యాప్ ద్వారా పరోక్షంగా సందేశం పంపింది. ప్రాదేశిక వాదనల కంటే వాస్తవ పరిస్థితులే ముఖ్యమని అగ్రరాజ్యం భావిస్తోంది. ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో భారత్ దౌత్య సత్తాను చాటిచెప్పడమే కాకుండా, పాకిస్థాన్‌ను మరింత ఏకాకిని చేసింది.