Saudi Arabia: ఒకేరోజు 81 మందిని ఉరి తీసిన సౌదీ ప్రభుత్వం

Saudi Arabia: ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు.. మహిళలను, పిల్లలను చంపిన వారికి ఉరి

Update: 2022-03-14 02:00 GMT

Saudi Arabia: ఒకేరోజు 81 మందిని ఉరి తీసిన సౌదీ ప్రభుత్వం 

Saudi Arabia: సౌదీ అరేబియాతో పాటు అరబ్ దేశాల్లో చట్టాలు, శిక్షలు ఎంతో కఠినంగా ఉంటాయి. శిరచ్చేదాలు, చేతులు, కాళ్లు తెగ నరకడాలు అక్కడ మామూలే. తాజాగా సౌదీ అరేబియా ప్రభుత్వం ఒకేరోజు 81 మందిని ఉరి తీసింది. మరణశిక్ష పడ్డ వారిలో కొందరు అల్‌ఖైదా, ఐసీస్, యెమెన్ హౌతీ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నట్లు నిర్ధారణ అయింది. మరికొందరు మహిళలను, పిల్లలను చంపినట్లు తేలింది. దీంతో వారందరిని ఉరి తీశారు. వారిలో 73 మంది సౌదీ అరేబియా జాతీయులు కాగా ఏడుగురు యెమెన్ దేశస్తులు, ఒక సిరియా పౌరుడున్నాడు. గత మూడున్నర దశాబ్దాల కాలంలో ఒకేరోజు ఇంతమందికి మరణశిక్ష అమలు చేయడం ఇదే ప్రథమం. 1980లో సౌదీలో ఒకేరోజు 63 మంది తలలు నరికి మరణశిక్ష అమలు చేశారు.

Tags:    

Similar News