Russia: కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించిన రష్యా

Russia: *ఉక్రెయిన్‌కు యూరప్‌ దేశాలు అందించిన ఆయుధాలు ధ్వంసం *కీవ్‌ సహా ప్రధాన నగరాలపై కొనసాగుతున్న బాంబుల వర్షం

Update: 2022-03-26 04:14 GMT

Russia: కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించిన రష్యా

Russia: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఉక్రెయిన్‌పై బాంబుల వర్షం కురిపిస్తూ రష్యా పైచేయి సాధిస్తూనే ఉంది. కీవ్‌ సహా ప్రధాన నగరాలపై రష్యా బాంబుల మోత మోగిస్తోంది. తాజాగా మరోసారి కాలిబర్‌ క్రూజ్‌ మిస్సైల్‌ ప్రయోగించింది రష్యా. ఈ దాడిలో ఉక్రెయిన్‌కు యూరప్‌ దేశాలు అందించిన ఆయుధాలు ధ్వంసమయ్యాయి. మరోవైపు.. యుద్ధంలో మృతుల వివరాలు వెల్లడించింది రష్యా. ఇప్పటివరకు 13 వందల 51 మంది తమ సైనికులు చనిపోయినట్టు ప్రకటించింది. దాదాపు 4వేల మంది గాయపడినట్టు వెల్లడించింది.

Tags:    

Similar News