Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడ్డ రిషి సునక్!

Rishi Sunak: వెనుకబడిన విషయాన్ని స్వయంగా అంగీకరించిన రిషి

Update: 2022-07-25 05:30 GMT

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో వెనుకబడ్డ రిషి సునక్!

Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో నిన్నమొన్నటి వరకు ముందంజలో ఉన్న భారత సంతతి నేత, మాజీ ఆర్థిక మంత్రి రిషి సునక్ తొలిసారి వెనకబడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బ్రిటన్‌లోని గ్రాంథాం నగరంలో ప్రసంగించిన ఆయన.. పోరులో వెనకబడిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కన్జర్వేటివ్ పార్టీలో కొందరు తన ప్రత్యర్థి, విదేశాంగ మంత్రి లిజ్‌ట్రస్‌ను ప్రధానిని చేయాలని అనుకుంటున్నారని, ఆయనకు మద్దతు ఇస్తుండడంతో తాను వెనకబడినట్టు తెలిపారు. అయితే, పార్టీలో కొందరు మాత్రం తన మాట వినేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

కాగా, బ్రిటిష్ అంతర్జాతీయ మార్కెట్ పరిశోధన సంస్థ 'యూగవ్' నిర్వమించిన సర్వేలోనూ సునక్‌కు ఎదురుగాలి వీస్తున్నట్టు స్పష్టమైంది. 730 మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులను సర్వే చేయగా వారిలో 62 శాతం మంది లిజ్ ట్రస్‌ను బలపరిచారు. రిషికి 38 శాతం మంది మాత్రమే మద్దతిచ్చారు. మొత్తం 1.60 లక్షల మంది కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు బ్రిటన్ ప్రధానిని ఎన్నుకోనున్నారు. ఎక్కువ మంది సభ్యులు ఎటు మొగ్గితే వారు ప్రధాని అవుతారు. ఆగస్టు 4 నుంచి సెప్టెంబరు మొదటి వారం వరకు 12 విడతలుగా ప్రధాని ఎన్నిక జరుగుతుంది.

Tags:    

Similar News