యుఎన్‌ఎస్‌సిలో భారత్ ఎన్నికపై పాక్ అక్కసు..

త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) లో భారత్ 8వ సారి తాత్కాలిక సభ్య దేశంగా అవతరించనుంది. భారత్ కు మెజారిటీ దేశాలు మద్దతు పలుకుతున్నాయి

Update: 2020-06-17 07:55 GMT

త్వరలో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యుఎన్‌ఎస్‌సి) లో భారత్ 8వ సారి తాత్కాలిక సభ్య దేశంగా అవతరించనుంది. భారత్ కు మెజారిటీ దేశాలు మద్దతు పలుకుతున్నాయి. ఇప్పటికే సభ్యుల మద్దతు కూడగట్టింది. అయితే భద్రతా మండలికి భారత్ ఎన్నిక కావడంపై పాకిస్తాన్ తన అక్కసు వెళ్లగక్కింది. ఇది తమకు సంతోషకరమైన విషయం కాదని, ఆందోళన కలిగించే విషయం అని పేర్కొంది. దీనిపై విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి మాట్లాడుతూ.. యుఎన్‌ఎస్‌సిలో తాత్కాలిక సభ్యత్వం పొందాలన్న భారత్ ఉద్దేశం పాకిస్థాన్‌కు ఆందోళన కలిగించే విషయమని అన్నారు. ఈ వేదిక నుంచి లేవనెత్తాల్సిన ప్రతిపాదనలను భారత్‌ ఎప్పుడూ తిరస్కరిస్తోందని అన్నారు. ముఖ్యంగా కాశ్మీర్ వంటి సమస్యలు ఉన్నాయని.. కాశ్మీరీలు వారి హక్కులను హరించడం ద్వారా అణచివేతకు గురయ్యారని పేర్కొన్నారు.

కాగా 193 మంది సభ్యులతో కూడిన సర్వసభ్య సమావేశంలో, భారతదేశానికి మూడింట రెండొంతుల మెజారిటీ అంటే 128 మంది సబ్యు మద్దతు అవసరం. ఈ ఎన్నిక జనరల్ అసెంబ్లీ హాలులో జరుగుతుంది. సభ్య దేశాలు రహస్య బ్యాలెట్ ద్వారా ఓటు వేస్తాయి. భారతదేశం గెలిస్తే, దాని పదవీకాలం జనవరి 1 నుండి ప్రారంభమవుతుంది. కాగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మొత్తం 15 దేశాలు ఉన్నాయి. వీటిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ మరియు చైనా శాశ్వత సభ్య దేశాలు కాగా.10 దేశాలకు తాత్కాలిక సభ్యత్వం ఇచ్చారు. వీటిలో బెల్జియం, కోట్ డి ఐవోర్, డొమినికన్ రిపబ్లిక్, గినియా, జర్మనీ, ఇండోనేషియా, కువైట్, పెరూ, పోలాండ్, దక్షిణాఫ్రికా, భారతదేశం ఉన్నాయి. తాత్కాలిక సభ్య దేశాల పదవీకాలం రెండేళ్లు ఉంటుంది.

 

Tags:    

Similar News