ఈరోజుతో ముగియనున్న ఆపరేషన్ గంగా
Operation Ganga: *ఇప్పటివరకు ఉక్రెయిన్ నుంచి 20వేల మంది తరలింపు *ఈరోజు 7విమానాల్లో మిగిలి భారతీయుల తరలింపు
ఈరోజుతో ముగియనున్న ఆపరేషన్ గంగా
Operation Ganga: ఉక్రెయిన్ యుద్ధ భూమి నుంచి భారతీయులను తరలించే ఆపరేషన్ గంగా ఈరోజుతో ముగియనుంది. ఆపరేషన్ గంగాలో భాగంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం 20వేల మందిని భారతీయులను స్వదేశానికి తరలించింది. చివరి విడతగా ఈరోజు 7 విమానాల్లో భారతీయ విద్యార్థులు స్వదేశానికి చేరుకోనున్నారు. ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు గణాంకాలపై ఈరోజు విదేశీ వ్యవహారాల శాఖ అధికారిక ప్రకటన చేయనుంది. ఇప్పటికే హంగరీ నుంచి చివరి బ్యాచ్ భారత్ చేరుకున్నట్లు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి ట్విటర్ లో ప్రకటించారు. హంగరీ నుంచి మొత్తం 6711మందిని తరలించినట్లు హర్దీప్ సింగ్ ప్రకటించారు.