No Mask in Israel: మాస్కులతో మాకు పనిలేదు!

No Mask in Israel: అదేంటి.. మాస్క్ లేకపోతే వైరస్ సోకుతుంది కదా.. మరి మాస్క్ అవసరం లేదేంటి అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా!

Update: 2021-04-23 02:45 GMT

ఇజ్రాయిల్‌లో ఇక నుంచి మాస్క్ అవసరం లేదంటున్న ఆ దేశ ప్రధాని (ఫొటో ట్విట్టర్)

No Mask in Israel: అదేంటి.. మాస్క్ లేకపోతే వైరస్ సోకుతుంది కదా.. మరి మాస్క్ అవసరం లేదేంటి అంటున్నారని ఆశ్చర్యపోతున్నారా! కరోనా సెకండ్ వేవ్ తో పాజిటివ్ కేసులు అన్ని దేశాల్లో విపరీతంగా పెరిగిపోతుంటే.. ఇదేం నిర్ణయమని ఆలోచిస్తున్నారా! అవునండీ.. ఇజ్రాయిల్ దేశంలో ఇక నుంచి మాస్క్ అవసరం లేదంట. మాస్క్ లు లేకుండా బహిరంగంగా జల్సాలు చేయవచ్చంట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్వయంగా వెల్లడించారు. ఆ వివరాలేంటో చూద్దాం..

ఇజ్రాయిల్ దేశంలో ముందుచూపుగా కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. దేశ జనభాలో సగానికి పైగా ఈ వ్యాక్సినేషన్ అందించారంట. దీంతో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్న ఆదేశాలను ప్రభుత్వం ఆదివారం రద్దు చేసింది. ప్రజలకు టీకాలు అందించి, కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో విజయం సాధించిందంట.

ఇజ్రాయిల్ దేశంలో 60 శాతం మంది ఒక్కడోసు టీకా తీసుకున్నారంట. అలాగే 56 శాతం మంది ప్రజలు రెండో డోసు పూర్తిచేసుకున్నారంట. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ దేశంలో ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ టీకాలను అందిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. కాగా, 16 ఏళ్లలోపు వారిని టీకా నుంచి మినహాయింపు ఇచ్చారు. 

Tags:    

Similar News