Nepal Political Turmoil Updates: నేపాల్ రాజకీయ ప్రతిష్టంభన : త్వరలోనే ప్రధాని..

Nepal Political Turmoil Updates: నేపాల్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తీరేటట్టుగా పరిస్థితులు కనబటం లేదు. ప్రధాని కేపీ శర్మ ఒలి ని.. అధికార నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) వ్యతిరేక వర్గం రాజీనామా కోరుతోంది.

Update: 2020-07-06 07:06 GMT

Nepal Political Turmoil Updates: నేపాల్ లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం ఇప్పట్లో తీరేటట్టుగా పరిస్థితులు కనబటం లేదు. ప్రధాని కేపీ శర్మ ఒలి ని.. అధికార నేపాలీ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) వ్యతిరేక వర్గం రాజీనామా కోరుతోంది. అయితే ఒలి మాత్రం అసంతృత్తి నేతల్ని బుజ్జగించే పనిలో పడ్డారు. కానీ సీనియర్ నేతలు మాత్రం ప్రధాని ఒలి వ్యవహారశైలి పట్ల గుర్రుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఒలి ఆదివారం ఆర్మీ చీఫ్‌ను కలిశారు, ఒలి తన అధికారాన్ని నిలుపుకోవటానికి ఆర్డినెన్స్ ప్రకటించడంతో సహా కొన్ని కఠినమైన చర్యలకు ఆయన వెళ్లవచ్చనే ఊహాగానాలు వస్తున్నాయి. గత రెండు రోజుల వ్యవధిలో ఆర్మీ చీఫ్‌ తో ప్రధాని భేటీ అవ్వడం వరుసగా ఇది రెండోసారి కావడంతో ఒలి వ్యతిరేక వర్గంలో అలజడి మొదలైంది.

మరోవైపు మాజీ ప్రధాని, ఎన్‌సిపి కోచైర్మన్ పుష్ప్ కమల్ దహల్ ప్రచండ తోను చర్చలు జరిపారు. అయితే, ఇరువురు నాయకులు ఈ విషయంలో ఎటువంటి నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా తెలియలేదు. ఇంకా చెప్పాలంటే, ఒలి రాజీనామా చేస్తారా లేదా అనేది కూడా అంతుబట్టడం లేదు. సోమవారం జరగాల్సిన స్టాండింగ్ కమిటీ సమావేశం రెండు రోజులు వాయిదా పడింది. దీంతో ఒలి తన పదవిని కాపాడుకోవడానికి మరింత సమయం దొరికినట్లయింది. ఇదే క్రమంలో పార్టీ కార్యనిర్వాహక అధికారాలను ప్రచండకు అప్పగించడానికి సుముఖంగా ఒలి ఉన్నారని, అయితే పదవులను వదులుకునే మానసిక స్థితిలో లేరని ప్రచారం మాత్రం జరుగుతోంది. 

Tags:    

Similar News