Nepal PM KP Sharma: ఈరోజు రాజీనామా చేస్తారా?

Nepal PM KP Sharma: నేపాల్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి.

Update: 2020-07-04 08:30 GMT

Nepal PM KP Sharma: నేపాల్ లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామాపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం. అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) స్టాండింగ్ కమిటీకి చెందిన 40 మంది నాయకులలో 33 మంది ఒలి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం, అసంతృప్తిగా ఉన్న కొంతమంది నాయకులను బుజ్జగించేందుకు ఒలి ప్రయత్నాలు ప్రారంభించారు. అంతకుముందు ఆయన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని పుష్ప్ కమల్ దహల్ ప్రచండ తో భేటీ అయ్యారు. మూడు గంటలపాటు జరిగిన ఈ సమావేశంలో అసంతృప్తి నేతలపై చర్చించారు. అనంతరం ఎన్‌సిపి ద్వితియాశ్రేణి విభాగం నాయకులతో కూడా సంభాషించారు.

కోవిడ్ -19 ను అధిగమించడంలో ఒలి విఫలమయ్యారని ఆయనపై ఆరోపణలున్నాయి. అలాగే ఇటీవల తలెత్తిన భారతదేశం ,చైనా మధ్య వివాదంలో అనవసరంగా కల్పించుకున్నారని సభ్యులు అభిప్రాయపడుతున్నారు.. ఈ క్రమంలో నేపాల్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు భారతదేశం కుట్ర పన్నిందని ఒలి ఆరోపించారు. ఇది మరింత వివాదాస్పదం అయింది. దీని తరువాత ఒలి ప్రభుత్వంపై ఒత్తిడి మరింత ఎక్కువైంది. ఒలి రాజీనామా చెయ్యాలన్న డిమాండ్ ఊపందుకుంది. దీంతో పార్లమెంటులోని అధికార సభ్యులు రెండు మూడు గ్రూపులుగా ఏర్పడ్డారు. మరోవైపు ఒలి తన పదవిని కాపాడుకోవడం కోసం పార్టీలోని పలువురు పెద్దలను కలుస్తూనే ఉన్నారు.. ప్రధాని పదవి విషయంలో సహకారం అందించాలని కోరారు. అయితే కొందరు సీనియర్ నేతలు మాత్రం ఒలి ప్రతిపాదనపై ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు. దాంతో ఈరోజు ఒలి రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వస్తున్నాయి. ప్రచండ నేతృత్వంలోని పార్టీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో, 44 మంది సభ్యులలో 33 మంది ఒలి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.



Tags:    

Similar News