North Korean: తగ్గేదే లే అంటున్న నార్త్‌కొరియా

North Korean: మరోవైపు క్షిపణుల ప్రయోగాలతో దూసుకెళ్తున్న కిమ్‌

Update: 2022-03-16 05:00 GMT

North Korean: తగ్గేదే లే అంటున్న నార్త్‌కొరియా

North Korean: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ ఏమాత్రం తగ్గడంలేదు. ఓ వైపు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందేమోనని భయపడుతుంటే ఎవడు ఏమైతే నాకేంటి అన్నట్టు వ్యవహరిస్తున్నారు. వరుస క్షిపణి ప్రయోగాలతో కిమ్‌ రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ క్షిపణిని ప్రయోగించినట్టు దక్షిణ కొరియా మిలటరీ తెలిపింది. సునన్‌ ప్రాంతంలోని గుర్తుతెలియని క్షిపణిని ఉత్తర కొరియా ఉదయం ప్రయోగించిందని సియోల్‌ జాయింట్‌ చీఫ్స్‌ ఆఫ్‌ స్టాఫ్‌ వెల్లడించింది. అయితే ఈ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా పది సార్లు ప్రయోగాలు జరిపింది.

Tags:    

Similar News