Imran Khan: షరీఫ్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన ఇమ్రాన్ ఖాన్

Imran Khan: అమెరికా తొత్తులు షరీఫ్, జర్దారీలంటూ ఇమ్రాన్ ధ్వజం

Update: 2022-04-15 05:15 GMT

షరీఫ్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన ఇమ్రాన్ ఖాన్

Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని, పదవి కోల్పోయిన నాటి నుంచి నిత్యం సంచలనాలు నమోదు చేస్తూనే ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయ్. ప్రస్తుత పాక్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ హయాంలో అణ్వాయుధాలు సురక్షితం కాదంటూ బాంబు పేల్చారు. అమెరికా కుట్రతో పదవి కోల్పోయానంటున్న ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయ్. అణ్వాయుధ ఆస్తులను కాపాడుకోవడంలో పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉన్న అనుమానాలను ఇమ్రాన్ వ్యక్తం చేయడంపై ఆర్మీ తీవ్రంగా స్పదించింది.

విదేశీ కుట్రలో భాగంగా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు దేశ అణు కార్యక్రమాన్ని కాపాడగలరా అంటూ ఇమ్రాన్ ఖాన్ గత కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రస్తుతం దేశానికి రక్షణగా ఉన్న కీలక అణ్వాయుధ వ్యవస్థ వారి చేతిలో ఉందని దానిని వారు కాపడగలరా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు అణ్వాయుధాలను చూసుకుంటున్న వ్యవస్థలు కొత్త పాలకుల చేతిలో ఎలా పనిచేస్తారోనన్న ఆందోళన ఉందన్నారు ఇమ్రాన్. ఉక్రెయిన్‌పై రష్యా దాడి నేపథ్యంలో తాను మాస్కో పర్యటనపై కోపంతో అమెరికా కుట్ర చేసిందని ఇమ్రాన్ ఖాన్‌ను ఆరోపణలు గుప్పిస్తున్నారు.

ఐతే పాకిస్తాన్ ప్రధాని చేసిన సంచలన ఆరోపణలపై పాక్ ఆర్మీ స్పందించింది. పాకిస్తాన్ ఆర్మీ మీడియా విభాగం డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తీకర్ ఖాన్ తోసిపుచ్చారు. పాకిస్తాన్ అణ్వాయుధాలు కేవలం ఒక వ్యక్తి చేతిలో ఉండవని ఆ విషయంలో ఎవరూ భయపడాల్సిన పనిలేదన్నారు. అణ్వాయుధాల అంశాన్ని రాజకీయాల్లోకి లాగొద్దని దశాబ్దాలుగా అవి సుశిక్షతంగా ఉన్నాయని ఆర్మీ స్పష్టం చేసింది. అణ్వాయుధాలు కమాండ్, కంట్రోల్ మెకానిజం చేతిలో ఉన్నాయన్నారు.

ఐతే లేటేస్ట్‌గా నిర్వహించిన రోడ్ షోలో ఇమ్రాన్ ఖాన్ షరీఫ్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. దోపిడీదారులు, దొంగలు చేతుల్లో పాకిస్తాన్ అణ్వాయుధాలు సురక్షితంగా ఉంటాయా అంటూ ప్రశ్నించారు. అమెరికా పన్నిన విదేశీ కుట్రలో భాగమే తనని పదవీ విచ్యుతుడ్ని చేసిందన్నారు. ఇక అమెరికా దయాదాక్షిణ్యాలు పాకిస్తాన్ కు ఎంత మాత్రం అవసరం లేదని అధికారంలోకి వచ్చిన అమెరికా తొత్తులు షరీఫ్, జర్దారీలకు ప్రజల మద్దతు లేదన్నారు. డబ్బుతో రాజకీయాలు చేసే ఇలాంటి వ్యక్తులు అణ్వాయుధాలను రక్షించగలరా అని ప్రశ్నించారు ఇమ్రాన్ ఖాన్. 

Tags:    

Similar News