జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య

*షింజో అబేను కాల్చి చంపిన దుండగులు

Update: 2022-07-08 05:21 GMT

జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య

Ex-Japan PM Shot Live Updates: జపాన్‌ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్యకు గురయ్యారు. నరా నగరంలోని ఓ బహిరంగ సభలో అబే ప్రసంగిస్తుండగా దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ ఘటనలో షింజో అక్కడికక్కడే కుప్పకూలారు. బుల్లెట్లు ఆయన ఛాతీలోకి దూసుకెళ్లడంతో తీవ్ర రక్తస్రావమైంది. కాగా సంఘటన జరిగిన వెంటనే ఆయనను ఒక హెలికాప్టర్‌లో నరా మెడికల్‌ యూనివర్శిటీ వైద్యశాలకు తరలించారు.

అయితే అప్పటికే ఆయన శరీరంలో ఎలాంటి కదలికలు లేవని, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షింజో కన్నుమూశారని అక్కడి అధికారులు తెలిపారు. 2006 - 2007, 2012 - 20 రెండు పర్యాయాలుగా జపాన్‌ ప్రధానిగా సేవలు అందించారు షింజో అబే.

Tags:    

Similar News