Elon Musk: నేను మోడీకి అభిమానిని.. త్వరలో భారత్‌కు టెస్లా..

Elon Musk: దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మోడీ టెస్లాను ఆహ్వానించారు

Update: 2023-06-21 05:53 GMT

Elon Musk: దేశంలో పెట్టుబడులు పెట్టడానికి మోడీ టెస్లాను ఆహ్వానించారు

Elon Musk: ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో తొలిరోజే ఓ అద్భుతమైన మీటింగ్ జరిగింది. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. భారత్ లో పెట్టుబడులు, టెక్నాలజీ విషయంలో సహాయం తదితర అంశాలపై ఇద్దరి మధ్య చర్య జరిగింది. ఈ సందర్భంగా ఎలన్ మస్క్‌ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. న్యూయార్క్‌లో మోడీతో సమావేశం అనంతరం భారత ప్రధానికి దేశాభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు ఎలన్ మస్క్ .దేశంలో పెట్టుబడులు పెట్టడానికి టెస్లాను రమ్మని ఆహ్వానించారని అన్నారు. తాను మోడీకి అభిమానినని చెప్పారు. ప్రధాని మోడీతో సమావేశం చాలా ఉత్సాహ పూరిత వాతావరణంలో జరిగిందన్న మస్క్..త్వరలో భారత్ పర్యటనను రానున్నట్లు ప్రకటించారు. స్టార్ లింక్ ఇంటర్నెట్ ను ఇండియాకు తీసుకురావటం ద్వారా మారుమూల పల్లె ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలను అందించేందుకు ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు మస్క్ తెలిపారు.

ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్‌గా ఉన్న భారత్ ఉందన్నారు. దేశం పట్ల ప్రధాని మోదీకి చాలా శ్రద్ధ ఉందని తెలియజేశారు. అందుకే భారత్ రావాలని ఆయన ఒత్తిడి చేస్తున్నారన్నారు. భవిష్యత్ ఇండియాను తలుచుకుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. చాలా సంవత్సరాల క్రితం మోడీ తమ ఫ్రెమాంట్ కర్మాగారాన్ని సందర్శించారని 2015 నాటి విషయాన్ని గుర్తు చేశారన్నారు మస్క్‌.

మోడీ కొత్త కంపెనీలను ఓపెన్ మైండ్‌తో ఆహ్వానించి వారికి అండగా నిలవాలనుకుంటున్నారన్నారు. భారత్‌కు ప్రయోజనం కలిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. వచ్చే ఏడాది భారత్‌లో సందర్శించాలని ప్లాన్ చేస్తున్నానన్నారు ఎలాన్ మస్క్ . టెస్లా భారతదేశంలోకి ప్రవేశించబోతుందని తెలియజేశారు. తనకు మద్దతు ఇచ్చినందుకు మోడీకి ధన్యవాదాలు తెలియజేసారు.

Tags:    

Similar News