Donald Trump about US role in Bangladesh Crisis: బంగ్లాదేశ్‌లో నెలకున్న సంక్షోభం వెనుక అమెరికా శక్తుల హస్తం ఉందని గతంలో మీడియాలో కొన్ని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టి అప్పటి వరకు అమెరికాలో ఆశ్రయం పొందిన మొహమ్మద్ యూనస్‌కు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం పగ్గాలు రావడం వెనుక అమెరికా డీప్ స్టేట్ కీలక పాత్ర పోషించిందనే టాక్ బలంగా వినిపించింది.
తాజాగా ఇదే విషయమై అమెరికా మీడియా కూడా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ని అడిగింది. అమెరికాలో జో బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కొంతమంది మొహమ్మద్ యూనస్ తో చేతులు కలిపి బంగ్లాదేశ్ లో ప్రభుత్వం మార్చారనే ఆరోపణలపై స్పందించాల్సిందిగా ఒక జర్నలిస్ట్ కోరారు.
జర్నలిస్ట్ అడిగిన ఈ ప్రశ్నకు డోనల్డ్ ట్రంప్ స్పందించారు. బంగ్లాదేశ్ సంక్షోభంలో అమెరికా డీప్ స్టేట్ పాత్ర లేదని అన్నారు. ఆ విషయంలో ప్రధానికే ఎక్కువ విషయాలు తెలుస్తాయని, బంగ్లాదేశ్ లో ఏం జరుగుతుందో ఆయనకే బాగా తెలుసునని మోదీ వైపు చూస్తూ అన్నారు.
ఇదే విషయమై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ స్పందిస్తూ ట్రంప్, మోదీ భేటీలో బంగ్లాదేశ్ సంక్షోభం ప్రస్తావన వచ్చింది నిజమేనని అన్నారు. ఈ విషయంలో ప్రధాని మోదీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పారని అన్నారు. అంతేకాదు... బంగ్లాదేశ్ లో ఇటీవల జరుగుతున్న పరిణామాలపై ప్రధాని ఆందోళన వ్యక్తంచేశారని తెలిపారు. బంగ్లాదేశ్ లో పరిస్థితులు మెరుగుపడి మళ్లీ సత్సంబంధాలు కొనసాగించే రోజు వస్తుందని మోదీ ట్రంప్‌తో అన్నారని మిస్త్రీ గుర్తుచేశారు.
Modi meets Donald Trump: మోదీ అమెరికా పర్యటన ఫలించిందా? భారత్ విషయంలో ట్రంప్ వెనక్కి తగ్గారా?