PM Modi: కంగ్రాట్స్ మై డియర్ ఫ్రెండ్..ట్రంప్‎న‎కు మోదీ అభినందనలు

Update: 2025-01-21 00:11 GMT

PM Modi: అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ నకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు.

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ రోటుండాలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన ట్రంప్ నకు ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెట్టారు.

అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన నా ప్రియ మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ నకు అభినందనలు అంటూ మోదీ చెప్పారు. ఇరుదేశాల ప్రయోజనాలు, ప్రపంచానికి మంచి భవిష్యత్తును అందించడానికి మీతో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. మీ పదవీ కాలం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు.


డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచం మొత్తం ప్రధాని మోదీని ప్రేమిస్తోందని అన్నారు. భారతదేశం అద్భుతమైన దేశం, ప్రధాని మోదీ అద్భుతమైన వ్యక్తి. తనను, భారత్‌ను తన నిజమైన స్నేహితులుగా భావిస్తున్నానని ట్రంప్‌ చెప్పారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ట్రంప్ తొలిసారి మాట్లాడిన ప్రపంచ నేతలలో ప్రధాని మోదీ కూడా ఒకరని డొనాల్డ్ ట్రంప్ చెప్పారు.

Tags:    

Similar News