Chinese Rocket: భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్‌ శకలాలు

Chinese Rocket: ఏరు దాటిన తెప్పను తగలేయడం తీరు చైనా చక్కటి నిదర్శనం..

Update: 2022-07-31 12:30 GMT

Chinese Rocket: భూ కక్ష్యలోకి ప్రవేశించిన చైనా రాకెట్‌ శకలాలు

Chinese Rocket: ఏరు దాటిన తెప్పను తగలేయడం తీరు చైనా చక్కటి నిదర్శనం అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి మాడ్యూల్‌ను తరలించిన లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ను పని అయిపోయాక వదిలేసింది. ఇప్పుడు దాని శకలాలు భూమివైపు దూసుకొస్తున్నాయి. శకలాలను చూసి ఉల్కాపాతంగా భ్రమించి పలువురు వీడియోలు తీసుకొన్నారు. శనివారం రాత్రి 10.45 సమయంలో హిందూ మహాసముద్రంపై ఇవి భూ కక్ష్యలోకి ప్రవేశించాయి. అమెరికా స్పేస్‌ కమాండ్‌ కూడా ఇదే సమయంలో చైనా రాకెట్‌ శిథిలాలు భూ వాతావరణంలోకి చేరినట్లు నిర్ధారించింది. తూర్పు, దక్షిణాసియాలోని పలు దేశాల్లో లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాలు దూసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. మలేషియా మీదుగా ఈ శకలాలు ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్‌ క్రిస్‌ హాడ్‌ఫీల్డ్‌ కూడా షేర్‌ చేశారు.

అయితే లాంగ్‌మార్చ్‌ 5బీ రాకెట్‌ శకలాలు ఇప్పటికే కొన్ని భూమిని తాకి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు కూలుతున్న రాకెట్‌ను నిర్లక్ష్యంగా వదిలేసిన చైనా స్పేస్‌ ఏజెన్సీ తీరుపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకెట్‌ శకలాలను భూ వాతావరణంలోకి రాకుండా అడ్డుకోవాల్సిన చైనా పట్టనట్టు వ్యవహరిస్తోందని నాసా అడ్మినిస్ట్రేటర్‌ బిల్‌ నిల్సన్‌ ఆరోపించారు. అంతరిక్ష కార్యకలాపాలు నిర్వహించే దేశాలు అత్యుత్తమ విధానాలను అనుసరించాలని ఇంత నిర్లక్ష్యం వ్యహరిస్తే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. లాంగ్‌మార్చ్‌ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు నివాస ప్రాంతాల్లో పడితే ఆస్తి, ప్రాణ నష్టం కలిగే అవకాశం ఉందని బిల్‌ నిల్సన్ వివరించారు. అయితే రాకెట్‌ కంట్రోల్‌ తాము కోల్పోయామని చైనా చెబుతుండడం గమనార్హం.


Tags:    

Similar News