MLC Kavitha: మహిళా బిల్లులో ఓబీసీ మహిళల్ని చేర్చకపోవడం దురదృష్టకరం
MLC Kavitha: లండన్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటన
MLC Kavitha: మహిళా బిల్లులో ఓబీసీ మహిళల్ని చేర్చకపోవడం దురదృష్టకరం
MLC Kavitha: మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ కోటాను చేర్చే వరకు తమ పోరాటం ఆగదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. లండన్ పర్యటనలో భాగంగా ఆమె బ్రిడ్జ్ ఇండియా కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఇటీవల పాసైన మహిళా బిల్లులో ఓబీసీ మహిళలన్ని చేర్చకపోవడం దురదృష్టకమన్నారు. భారతీయ సమాజంలో ఓబీసీల వర్గం చాలా పెద్దదని, వారిని ఆ కోటాలో చేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్.. సగం జనాభాను ఇంటికి పరిమితం చేస్తే దేశానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల మహిళల్ని చేర్చుకోవడమే ముఖ్యమైన విషయమన్నారు.