Bangladesh jet crash: స్కూల్ బిల్డింగ్‌పై కూలిన ట్రైనింగ్ జెట్...పలువురి మృతి
Bangladesh Jet Crash: ఈ విమానాలకు ఏం దిష్టి తగిలిందో గానీ ఈ మధ్యకాలంలో రోజుకో విమాన ప్రమాదం గురించి వింటున్నాం. మొన్న ఇండియా, నిన్న అమెరికా, ఈ రోజు బంగ్లాదేశ్. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన విమాన ప్రమాదంలో పలువురి మృతి చెందారు
Bangladesh jet crash: స్కూల్ బిల్డింగ్‌పై కూలిన ట్రైనింగ్ జెట్...పలువురి మృతి
Bangladesh Jet Crash: ఈ విమానాలకు ఏం దిష్టి తగిలిందో గానీ ఈ మధ్యకాలంలో రోజుకో విమాన ప్రమాదం గురించి వింటున్నాం. మొన్న ఇండియా, నిన్న అమెరికా, ఈ రోజు బంగ్లాదేశ్. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన విమాన ప్రమాదంలో పలువురి మృతి చెందారు. వివారాల్లోకి వెళితే..
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో విమాన ప్రమాదం జరిగింది. బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన F-7 BGI ట్రైనింగ్ విమానం సోమవారం మధ్యాహ్నం ఢాకా నగరంలోని మైల్స్ స్టోన్ స్కూల్ అండ్ కాలేజ్ ప్రాంగణంలో పడి కుప్పుకూలిపోయింది.
సోమవారం మధ్యాహ్నం 1.06 నిమిషాలకు విమానం టేకాఫ్ తర్వాత దియాబారి అనే ప్రాంతానికి వెళ్లిన వెంటనే ఒక స్కూల్ బిల్డింగ్ దగ్గర విమానం కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో స్కూల్లో విద్యార్దులు ఉన్నారు. అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. నలుగురు గాయపడ్డారని సమాచారం.
విమానం కూలిపోవడంతో ఘటనా స్థలంలో పొగ తీవ్రంగా కమ్మేసుకుంది. రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి. విమానం బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్‌కు చెందినదిగా ఆర్మీఅధికారికంగా ధృవీకరించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలంలో సహాయక చర్యలు మొదలుపెట్టారు.