ఇండియాకు అమెరికా లేటెస్ట్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఎగుమతి ఆపొద్దు

Wheat Exports: పొరుగు దేశాలకు అవసరాల మేరకు గోధుమలు సరఫరా చేస్తున్న ఇండియా

Update: 2022-05-17 08:27 GMT

ఇండియాకు అమెరికా లేటెస్ట్ రిక్వెస్ట్.. గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దు

Wheat Exports: ప్రపంచంలో ఆహార సంక్షోభం తీవ్రమవుతున్నతరుణంలో గోధుమల ఎగుమతులను నియంత్రించొద్దని ఇండియాను అమెరికా కోరింది. ఎగుమతులను తగ్గించాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలంది. ప్రపంచంలోని రెండో అతిపెద్ద గోధుమ ఉత్పత్తిదారుగా ఉన్న ఇండియా దేశంలో ధరల పెరుగుదలతో ఎగుమతులపై నిషేధం విధించింది. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే దేశీయంగా పంట దిగుబడులు, ఎండల కారణంగా గత సంవత్సర కాలంలో 20 శాతం మేర గోధుమలు, గోధుమ పిండి ధర పెరిగాయ్.

ప్రస్తుతం ఇండియా చుట్టుపక్కల దేశాలకు వారి అవసరాలకు తగిన విధంగ ఇండియా గోధుమలు సరఫరా చేస్తోంది. ఈ పరిస్థితిలో కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఐక్యరాజ్యసమితిలోని అమెరికా రాయబారి ఆందోళన వ్యక్తం చేశారు. దిగుమతుల తగ్గించొద్దని ఇండియా ఎగుమతులు తగ్గిస్తే ఆహార కొరత ఎక్కువవుతుందని రాయబారి థామస్-గ్రీన్‌ఫీల్డ్ పేర్కొన్నారు. పేద దేశాల ఆహార సంక్షోభాన్ని ఇండియా అర్థం చేసుకోవాలని అమెరికా అభిప్రాయపడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉక్రెయిన్ నుంచి గోధుమలు ఎగుమతయ్యేవని పేద దేశాలకు బ్రెడ్ బాస్కెట్‌గా ఉండేదని యుద్ధనేపథ్యంలో ఉక్రెయిన్ కీలక ఓడరేవులను రష్యా నిరోధించడంతో ఇబ్బందులు తలెత్తాయంటోంది. ఆహార కొరతతో ఆఫ్రికా దేశాలు విలవిలలాడుతున్నాయని అమెరికా వివరించింది.

'గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ - కాల్ టు యాక్షన్' సదస్సుకు మే 17 నుంచి మే 20 వరకు న్యూయార్క్‌లో కేంద్ర మంత్రి వి మురళీధరన్ హాజరుకానుండటంతో ఇండియాపై అమెరికా ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. ఇండియా ఏటా చేసే ఎగుమతులు గోధుమల విలువ 2 బిలియన్ డాలర్లుగా ఉండగా అందులో 50 శాతం ఒక్క బంగ్లాదేశ్‌కు ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయ్. యుద్ధం ప్రపంచ దేశాలను ఎన్నో రకాలుగా ఇబ్బందిపెడుతుంటే యుద్ధాన్ని రోజు రోజుకు కొనసాగేలా చేస్తూ ఓవైపు పేద దేశాలను వంచిస్తున్న అమెరికా ఇప్పుడు గోధుమల విషయంలో ఇండియా తగ్గించడాన్ని ప్రశ్నించడం నిజంగా విడ్డూరమే. యుద్ధం తక్షణం ఆగేలా చేయగలిగి ఉండి కూడా.. ప్రపంచాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్న అమెరికా తాజా సంక్షోభానికి కారణంగా భావించాల్సిందే.

Tags:    

Similar News