Iran new Army Chief: ఇరాన్ కు ఖొమేనీ తరువాత ఆర్మీ చీఫ్ ఎవరు? వినిపిస్తున్న పేరు ఇదే!

Iran new Army Chief: ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమేనీ మరణంతో ఇప్పుడు ఇరాన్ సైనిక నేతగా ఎవరు వ్యవహరిస్తారు అనే విషయంపై చర్చలు ప్రపంచ వ్యాప్తంగా నడుస్తున్నాయి

Update: 2026-03-01 04:16 GMT

Iran new Army Chief

Iran new Army Chief: అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణించినట్లు అధికారికంగా ధ్రువీకరణ వచ్చింది. దీంతో ఇప్పుడు ఇరాన్ కు కొత్త అధ్యక్షుడు ఎవరు అవుతారనే ఆసక్తి అంతటా నెలకొంది. ఇరాన్ లో ప్రభుత్వాధినేత ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే లోపు.. తాత్కాలికంగా ఎవరికైనా పగ్గాలు అప్పగిస్తారా? లేకపోతే ఇప్పటికే ఖమేనీ వారసుడిపై స్పష్టత ఉందా అనేదానిపై అంతర్జాతీయ మీడియాలో అనేక ఊహాగానాలు మొదలయ్యాయి.

Iran new Army Chief: ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇరాన్‌లో అధికారం చేపట్టడానికి ముగ్గురు వ్యక్తుల కమిటీ ఏర్పడింది. ఇరాన్ రాష్ట్ర సంస్థ IRNA ప్రకారం, దేశంలో అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ముగ్గురు వ్యక్తులతో కూడిన తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ కమిటీలో దేశ అధ్యక్షుడు, సుప్రీంకోర్టు (న్యాయవ్యవస్థ) అధిపతి, గార్డియన్ కౌన్సిల్ నుండి ఒక మత నాయకుడు ఉంటారు. ఈ ముగ్గురూ కలిసి ప్రస్తుతానికి దేశంలోని అన్ని వ్యవహారాలను నిర్వహిస్తారు.

కొత్త సుప్రీం నాయకుడు ఎన్నికయ్యే వరకు, ఈ ముగ్గురు సభ్యుల బృందం దేశ ప్రభుత్వం, వ్యవస్థ సజావుగా పనిచేయడానికి అన్ని ప్రధాన నిర్ణయాలను తీసుకుంటుంది.

ఇక అంతర్జాతీయంగా మీడియాలో ప్రముఖంగా ఒక పేరు ఇరాన్ కొత్త ఆర్మ్ చీఫ్ అవుతారని వినిపిస్తోంది. ఈ కథనాల ప్రకారం క్లెయిమ్- అహ్మద్ వాహిది కొత్త ఇరాన్ ఆర్మీ చీఫ్ అవుతారు.

ఎవరీ అహ్మద్ వాహిది

  • Iran new Army Chief: అహ్మద్ వాహిది ఒక ప్రముఖ ఇరానియన్ సైనిక, రాజకీయ నాయకుడు. ఈయనకు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తో అనుబంధం ఉంది.
  • 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత ఆయన IRGCలో చేరారు. 1988 నుండి 1998 వరకు, విదేశాలలో వ్యూహాత్మక, సైనిక కార్యకలాపాలకు బాధ్యత వహించే ఇరాన్ యూనిట్ అయిన కుడ్స్ ఫోర్స్‌కు కమాండర్‌గా పనిచేశారు.
  • 2009లో, ఆయన ఇరాన్ రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. ఆయన పదవీకాలంలోనే ఇరాన్ తన క్షిపణి, ఆయుధ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లింది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో 1994లో జరిగిన AMIA బాంబు దాడితో కూడా ఆయనకు సంబంధం ఉంది. అర్జెంటీనా ఆయనపై అభియోగాలు నమోదు చేసింది. ఇంటర్‌పోల్ ఆయనపై రెడ్ నోటీసు జారీ చేసింది.

మొత్తంగా చూసుకుంటే.. ఖమేనీ మరణంతో ఇరాన్ లో తీవ్ర విషాదం కనిపిస్తోంది. అంతర్జాతీయంగా అంతకు మించిన ఆందోళన వ్యక్తం అవుతోంది. ఖమేనీ వారసుడిగా ఎవరు వస్తారు? అమెరికా-ఇజ్రాయేల్ తదుపరి లక్ష్యం ఏమిటి? ఇరాన్-ఇజ్రాయేల్ మధ్య వివాదాలు సమసిపోయే అవకాశం ఉందా? ఇలాంటి ఎన్నో సందేహాలు ప్రపంచ వ్యాప్తంగా వెల్లువెత్తుతున్నాయి.

Tags:    

Similar News