Iran Tehran Tensions: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడి..ఉద్రిక్తంగా పరిస్థితి

Iran Tehran Tensions: ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ 'సింహాల గర్జన' ఆపరేషన్ పేరుతో వైమానిక దాడులు చేసింది. అమెరికా మద్దతుతో ఈ సైనిక చర్య జరుగుతోంది.

Update: 2026-02-28 08:25 GMT

Iran Tehran Tensions

Iran Tehran Tensions: ఇరాన్ రాజధాని టెహ్రాన్ సహా పలు కీలక నగరాల్లోభారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం భారీ పేలుళ్ల శబ్దాలు, వైమానిక దాడుల సైరన్లు వినిపించాయి. ఇజ్రాయెల్ రక్షణ దళాలు చేపట్టిన ఈ ఆకస్మిక వైమానిక దాడిలో ఇరాన్ కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఇజ్రాయెల్ దీనిని తమ రక్షణ కోసం చేపట్టిన "నివారణ దాడి"గా అభివర్ణించగా, ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో భద్రతా పరిస్థితులు ఒక్కసారిగా దిగజారాయి.

Iran Tehran Tensions: ఈ సైనిక చర్య నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని మూసివేసి, అన్ని విమాన రాకపోకలను నిలిపివేసింది. సున్నితమైన ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం లేదా ఇళ్లలోనే ఉండాలని స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దాడి జరిగిన ప్రాంతాల్లో వైమానిక దాడుల హెచ్చరికలు కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయ మీడియా నివేదికల ప్రకారం, ఈ ఆపరేషన్‌ను అమెరికా - ఇజ్రాయెల్ ఉమ్మడిగా చేపట్టినట్లు తెలుస్తోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కార్యాలయం సమీపంలో కూడా పేలుళ్లు సంభవించడంతో, ఆయన్ను వెంటనే సురక్షిత ప్రదేశానికి తరలించినట్లు సమాచారం. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఈ ఆపరేషన్‌కు "సింహాల గర్జన" (Roar of Lions) అని పేరు పెట్టారు.

వివాదానికి కారణాలు ఇవీ..

Iran Tehran Tensions: ఇరాన్ - అమెరికా మధ్య అణ్వాయుధ చర్చలు, అలాగే బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై నెలకొన్న విభేదాలు ఈ ఉద్రిక్తతలకు ప్రధాన కారణం. అమెరికా తన పౌరులను తక్షణమే ఇజ్రాయెల్ విడిచి వెళ్లాలని సూచించడం, అమెరికా దళాలు ఇరాన్ చుట్టూ మోహరించడం వంటి పరిణామాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు తమ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమం దేశ రక్షణకు అవసరమని, దీనిపై ఎటువంటి చర్చలకు తావులేదని ఇరాన్ స్పష్టం చేస్తోంది.

దాడులను ధృవీకరించిన ట్రంప్:

ఇదిలా ఉంటే, ఇరాన్ క్షిపణి వ్యవస్థలను పూర్తిగా నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా అమెరికా సైనిక చర్యలు కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. గతంలో జరిగిన దాడుల నుండి పాఠాలు నేర్చుకోని ఇరాన్, తన అణు కార్యకలాపాలను కొనసాగిస్తోందని, దీనిని అడ్డుకోవడానికి ఈ కఠిన నిర్ణయం తప్పలేదని ఆయన వివరించారు.

Iran Tehran Tensions: ఈ సైనిక కార్యకలాపాల్లో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని కూడా ట్రంప్ హెచ్చరించారు. భవిష్యత్తులో దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ భారీ చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఇరాన్ గగనతలంపై యుద్ధ విమానాల కదలికలు కొనసాగుతుండటంతో ఆ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

నెల రోజులుగా సన్నాహాలు చేస్తున్న ఇజ్రాయేల్

ఇరాన్‌పై దాడికి ముందు, ఇజ్రాయెల్‌లో సన్నాహాలు పూర్తిగా రహస్యంగా ఉంచారు. ఇజ్రాయెల్ మీడియా Ynet కథనం ప్రకారం, గత నెల రోజులుగా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్, వైమానిక దళ కమాండర్ జనరల్ టోమర్ బార్ ఆపరేటర్లతో ముఖాముఖి సమావేశాలు చాలా గోప్యంగా నిర్వహించారు.

ఈ రహస్య విన్యాసంలో భాగంగా, చీఫ్ ఆఫ్ స్టాఫ్ నిన్న ఒక విందుకు హాజరయ్యారు. ఐడిఎఫ్ మరిన్ని దాడులకు సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఐడిఎఫ్ ప్రధానంగా సరిహద్దు భద్రత కోసం రిజర్వ్ సైనికులను నియమిస్తోంది.

మధ్యప్రాచ్యంలో వేలాది మంది అమెరికన్ సైనికులు

మధ్యప్రాచ్యంలో (CENTCOM) అమెరికా సైనిక ఉనికి ప్రస్తుతం చాలా బలంగా ఉంది. మధ్యప్రాచ్యం మరియు పర్షియన్ గల్ఫ్‌లో సుమారు 30,000 నుండి 40,000 మంది అమెరికా సైనికులను మోహరించారు.

ప్రస్తుతం, మధ్యప్రాచ్యంలో దాదాపు ఆరు నావికాదళ నౌకలు ఉన్నాయి, వాటిలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ మరియు ఇతర కార్యకలాపాలను నిర్వహించగల మూడు గైడెడ్ క్షిపణి డిస్ట్రాయర్లు ఉన్నాయి.

Tags:    

Similar News