మా మాట వినకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తాం - ట్రంప్
US Israel strikes on Iran: ఇరాన్‌పై సంయుక్త సైనిక దాడులను అమెరికా అధ్యక్షుడు ధృవీకరించారు. అణ్వాయుధ కార్యక్రమాలు నిలిపివేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించారు.
మా మాట వినకపోతే ఇరాన్‌ను నాశనం చేస్తాం - ట్రంప్
US Israel strikes on Iran : ఇరాన్‌పై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడులు జరిగినట్లు Donald Trump వెల్లడించారు. పలుమార్లు హెచ్చరికలు చేసినప్పటికీ ఇరాన్ తన అణుకేంద్రాలను పునర్నిర్మించడానికి, క్షిపణి కార్యక్రమాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
అందువల్లే ఆ దేశంపై భారీ సైనిక చర్య చేపట్టినట్లు తెలిపారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలు కలిగి ఉండకూడదనే ఉద్దేశంతో వాటిని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తమ మాటలను పట్టించుకోకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ప్రపంచ ఉగ్రవాదానికి ఇరాన్ ప్రధాన మద్దతుదారుగా వ్యవహరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమ సొంత పౌరుల నిరసనలను కూడా ఆ దేశ ప్రభుత్వం అణిచివేస్తోందని విమర్శించారు. ఉగ్రవాద పాలనలో ఉన్న దేశం వద్ద అణ్వాయుధాలు ఉండటం ప్రపంచ భద్రతకు ముప్పుగా మారుతుందని పేర్కొన్నారు.
ఇరాన్ పాలకుల ముప్పు నుంచి అమెరికాను రక్షించుకోవడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఇకనైనా అణ్వాయుధ కార్యక్రమాలను నిలిపివేయాలని, లేనిపక్షంలో మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.