దారి మార్చిన జగన్‌...తెలంగాణ ఎన్నికలు...

Update: 2018-10-13 04:50 GMT

తెలంగాణ ఎన్నికలు ముగిసేవరకు ఏపీలో జగన్ పాదయాత్ర కొనసాగనుందా? మరికొద్ది రోజుల్లో ముగియాల్సిన జగన్‌ పాదయాత్రను పొడిగించబోతున్నారా? తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో ప్రభావం చూపుతాయని జగన్ భావిస్తున్నారా? అసలు జగన్‌ వ్యూహం ఏంటి? 

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప పాదయాత్ర డిసెంబర్‌ చివరి వారం వరకు కొనసాగే అవకాశం కనిపిస్తోంది. ముందు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారం 125 నియోజకవర్గాల్లో 307రోజులపాటు 3వేల 500 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగాల్సి ఉంది. అయితే ఇప్పటికే 116 నియోజకవర్గాలను కవర్‌ చేస్తూ 3100 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తిచేశారు జగన్‌. ఈ లెక్కన నవంబర్‌ 5నాటికే పాదయాత్ర ముగియాల్సి ఉంది. అయితే తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరికొన్ని రోజులు పాదయాత్రను సాగదీయాలని జగన్‌  భావిస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీలో కూడా ప్రభావం చూపుతాయని బలంగా నమ్ముతున్న జగన్‌ తెలంగాణలో ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చేవరకూ పాదయాత్ర కొనసాగిస్తే పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారట. అందుకే పాదయాత్రను డిసెంబర్‌ చివరి వారం వరకు కొనసాగించి ముగించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక పాదయాత్ర చేయగా మిగిలిన 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపట్టనున్నారు జగన్‌. మే వరకు ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం లేకపోవడంతో... అప్పటివరకూ ఏదో ఒక రూపంలో ప్రజల్లోనే ఉండాలనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.

Similar News