మగాళ్ళపై పోరుబాట ప‌ట్టిన మ‌గువ‌లు

Update: 2018-01-29 07:23 GMT

మహిళల్ని మోసం చేయడం...వేధింపులకు పాల్పడటం కొందరు మగాళ్ళకు అలవాటుగా మారిపోయింది. ప్రేమ పేరుతో మోసం చేయడం., పెళ్ళి తర్వాత వరకట్న వేధింపులకు పాల్పడటం మామూలైపోయింది. మగాళ్ళ చేతిలో మోసంపోయిన ఇద్దరి మగువలు పోరుబాట పట్టారు. 

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం బర్ల గూడానికి చెందిన పద్మను ప్రియుడు కిషోర్ మోసం చేశాడు. పెళ్ళి చేసుకుంటానని నమ్మించి ఆమెతో తిరిగి దగా చేశాడు. దీంతో పద్మ కిషోర్ ఇంటి ముందు ఆందోళనకు దిగింది. పద్మకు మద్దతుగా మహిళా సంఘాలు కూడా రంగంలోకి దిగాయి. పెద్దలకు చెప్పి పెళ్ళి చేసుకుందామని బీఈడీ చదువుతున్న పద్మను నమ్మించాడు కిషోర్. కొంత కాలం ఇద్దరూ కలసి ఒకే రూం లో కూడా ఉన్నారు. పెళ్ళిమాటెత్తేసరికి ఫోన్ స్విచ్చాఫ్ చేసి తప్పించుకు తిరుగుతున్నాడు.

మరోవైపు ఎన్ఆర్ఐ భర్త బసవ కిరణ్ నుంచి వరకట్న వేధింపులు ఎదుర్కొంటోన్న నేషనల్ హాకీ ప్లేయర్ కవితను అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. పెళ్ళి సమయంలో 60 సవర్ల బంగారం, 50 లక్షల నగదు కట్నంగా ఇచ్చినా మరింత ఆస్తి కావాలని వేధిస్తున్నాడనీ.. పైగా రెండో పెళ్ళి కి సిద్దమయ్యాడని అంటోంది. పెళ్లై 19 నెలలైనా భర్త తనను లండన్ తీసుకెళ్ళడం లేదని వాపోతోంది.  ప్రియుడి చేతిలో మోసపోయిన పద్మకు , వరకట్న వేధింపుల బాధితురాలు కవితకు న్యాయం చెయ్యాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

Similar News