ఇంతకీ ఈ స్వామి ఎవరు?

Update: 2018-09-17 08:17 GMT

తాడిపత్రి ఘటనతో స్వామి ప్రబోధానంద ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. అప్పటి వరకు భక్తులకు మాత్రమే తెలిసిన ఆయన తాజా పరిణామాలతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారారు. అయితే ఇంత జరుగుతున్నా అసలు స్వామి ప్రబోధనంద స్వామి తాము ఒక్క సారిగా చూడలేదంటున్నారు చుట్టుపక్కల గ్రామస్తులు, స్వామి భక్తులు. ఇంతకీ ఈ స్వామి ఎవరు? 

స్వామి ప్రబోధానంద ప్రపంచానికి తెలియని పేరు ఆధ్యాత్మిక బోధనలు, రచనలు, ప్రసంగాలు తెలిసిన వారికి మాత్రమే పరిచయమున్న పేరు తాడిపత్రిలో శనివారం జరిగిన వివాదంతో ఒక్కసారిగా ప్రబోధానంద స్వామి పేరు తెరపైకి వచ్చింది. త్రైత్ర సిద్ధాంత భగవద్గీత పేరుతో ఈయన రచనలు చేస్తూ ఉంటారు. ఈయన ఎక్కడ ఉంటారనేది భక్తులకు తెలియకపోయినా  వేలాది మంది నిత్యం ఆశ్రమాలకు వస్తూ ఉంటారు. ముఖ్యంగా ప్రతి పౌర్ణమి రోజున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చే ప్రసంగాన్ని వినేందుకు అనంతపురంతో పాటు చుట్టు పక్కల జిల్లాలు, కర్నాటక నుంచి కూడా భక్తులు తరలివస్తుంటారు. శ్రీకృష్ణమందిరం, ఇందూ జ్ఞాన వేదికను స్థాపించి తన రచనల్ని, ప్రసంగాలను ప్రచారం చేస్తున్నారు. మనుషులందరికీ దేవుడు ఒక్కడేనని పరమ పవిత్ర పరిశుద్ధ భగవద్గీత, పరిశుద్ధ బైబిల్, పవిత్ర ఖురాన్‌లలో ఉన్న దైవజ్ఞానం ఒక్కటేనంటూ ప్రచారం చేస్తుంటారు. 

చిన్నపొలమడ గ్రామంలోని ఆశ్రమంలో పౌర్ణమి రోజున  10 వేలమందికి పైగా భక్తులు హాజరై ప్రబోదానంద స్వామి బోధనలు విని తరిస్తుంటారు. దీంతో పాటు నిత్యం శ్రీ కృష్ణ కీర్తనలు, భజనలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ఈనెల ప్రారంభంలో వచ్చిన కృష్ణాష్టమి వేడుకలను వేలాది మంది భక్తుల సమక్షంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆశ్రమంపై తీవ్ర స్ధాయిలో వివాదం నడుస్తున్నా ఆశ్రమాన్ని మూసీ వేయాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేసినా ప్రబోదానంద స్వామి ఇంత వరకు స్పందించలేదు. భక్తులు మాత్రం ప్రభోదానంద స్వామి తమకు అండగా నిలుస్తాడంటూ భరోసా వ్యక్తం చేస్తున్నారు. 

Similar News