ముందస్తు ఉత్కంఠకు ఈ మధ్యాహ్నాంతో తెర ..?

Update: 2018-09-06 06:08 GMT

క్షణం .. క్షణం ఉత్కంఠ రేపుతున్న ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు కాసేపట్లో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రగతి నివేదన సభ అనంతరం వరుస పరిణామాలతో అసెంబ్లీ రద్దు దాదాపు ఖాయమైంది.  మంత్రి వర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే ముందు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. ఉన్న పళంగా హైదరాబాద్ రావాలంటూ ఎమ్మెల్యేలకు  సీఎంఓ కబురు పంపింది. ఎమ్మెల్యేల సూచనలతో పాటు తాజా పరిణామాలు , మంత్రి వర్గంలో తీసుకునే నిర్ణయాలపై చర్చించనున్నట్టు సమాచారం. 

అసెంబ్లీ రద్దుకు రంగం సిద్ధమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు మంత్రి వర్గ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి గంట ముందే ప్రగతి భవన్ చేరుకోవాలంటూ సీఎంఓ నుంచి మంత్రులకు పిలుపు అందింది. మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైన వెంటనే అసెంబ్లీ రద్దుపై చర్చించనున్నారు. ఏక వ్యాక్య తీర్మానంతో  అసెంబ్లీని రద్దు చేస్తూ తీర్మానించే అవకాశాలున్నాయి. అనంతరం  సీఎం కేసీఆర్ నేరుగా గవర్నర్ ను కలిసి ఇదే విషయాన్ని వెల్లడించనున్నారు.  మధ్యాహ్నం రెండున్నర గంటలకు తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో  అసెంబ్లీ రద్దుతో పాటు భవిష్యత్ కార్యాచరణను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు తాజాగా జనాకర్షక పథకాలు ప్రకటించిన నేపధ్యంలో  కేసీఆర్ ఎలా స్పందిస్తారనేది ఆస్తకిగా మారింది. 

Similar News