ఏపీలో ఎండాకాలం సెలవులు

Update: 2018-06-19 06:58 GMT

తూర్పు గోదావరి జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే భానుడు భగభగమండిపోతున్నాడు. ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం భయపడుతున్నారు.వానాకాలంలో మండు వేసవి ని తలపించే వాతావరణం చుక్కలు చూపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలతో సర్కార్ స్కూళ్లకు మూడురోజులు సెలవులు ప్రకటించింది.  మంగళవారం నుంచి 21వ తేదీ వరకు.. అంటే మూడ్రోజుల పాటు సెలవులు ఇస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ‘వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాం. ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలకూ మినహాయింపు లేదు. తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దుచేస్తాం’ అని హెచ్చరించారు. అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌, మోడల్‌ స్కూళ్లకు 19, 20, 21 తేదీల్లో సాధారణ సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాఽథ్‌దాస్‌ ఉత్తర్వులిచ్చారు. పాఠశాలలు ఈ నెల 22న పునఃప్రారంభమవుతాయన్నారు.
 

Similar News