హైకోర్టులో సిట్ అధికారులు రిట్ పిటిషన్...దాడి సమయంలో వేసుకున్న చొక్కా అప్పగించాలన్న అధికారులు..

Update: 2018-10-31 12:29 GMT

వైసీపీ అధినేత జగన్ తనపై జరిగిన హత్యాయత్నం కేసులో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని ఆరోపిస్తూ హైకోర్టును ఆశ్రయించారు.  ప్రభుత్వ వైఫల్యం వల్లే తనపై కుట్ర జరిగిందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ దాడి ఘటనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో సీఎం చంద్రబాబుతో సహా 8మందిని ప్రతివాదులుగా ఆయన పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం రేపు విచారణ జరపనుంది. 

మరోవైపు సిట్ అధికారులు కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విశాఖ ఎయిర్‌ పోర్టులో దాడి జరిగిన సమయంలో ప్రతిపక్ష నేత జగన్ వేసుకున్న చొక్కాను అప్పగించాలని ఆ పిటిషన్‌లో సిట్ అధికారులు కోరారు. శ్రీనివాసరావు నుంచి స్వాధీనం చేసుకున్న 11 పేజీల లేఖ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 

Similar News