అవకాశం దొరికిన ప్రతి సందర్భంలోనూ నటిగా తనేంటో ఫ్రూవ్ చేసుకుంటూనే ఉంది సమంత. తొలి చిత్రం 'ఏమాయ చేసావె' మొదలుకొని 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'మనం', 'అఆ' చిత్రాల వరకు తన ప్రతిభని చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యింది ఈ అమ్మడు.
ఇక తాజా చిత్రం 'రాజుగారి గది2'లోనూ అభినయానికి అవకాశమున్న పాత్రలో దర్శనమివ్వనుంది సమంత. సినిమాలో ఆత్మ పాత్రలో కనిపించి భయపెట్టనున్న సమంత.. కొన్ని హార్ట్‌టచింగ్ సీన్స్‌లోనూ కనిపించి గుండెల్ని పిండేస్తుందట. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్లో సంగీత దర్శకుడు థమన్ చెప్పగా.. తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి కూడా ట్విట్టర్లో చెప్పుకొచ్చింది.
సమంతకి రెగ్యులర్ గా డబ్బింగ్ చెప్పే చిన్మయి.. 'రాజుగారి గది2'కి అయితే డబ్బింగ్ చెపుతూ ఏడ్చేసిందట. అంతగా ఆ పాత్రని సమంత రక్తికట్టించిందని చిన్మయి తెలిపింది. నాగార్జున ప్రధాన పాత్రలో నటించిన 'రాజుగారి గది2' అక్టోబర్ 13న విడుదల కానుంది. దీనికి ఓంకార్ దర్శకత్వం వహించారు.