కొత్త 100 రూపాయల నోటు

Update: 2018-07-19 07:58 GMT

పెద్ద నోట్ల రద్దు తర్వాత  కొత్త నోట్లు రూ. 10 .రూ. 50, రూ.200, రూ.500, రూ.2000 చెలామణిలోకి   వచ్చాయి. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త నోట్లను విడుదల చేసింది. వంద రూపాయల నోటే ఎప్పుడు వస్తుందా అనుకుంటున్న సమయంలో కొత్త నోటును డిజైన్ చేస్తోంది రిజర్వ్ బ్యాంకు. నీలం రంగు కలర్‌కు ఓకే చెప్పి ప్రింట్ చేస్తోంది. ఈ నోటు ఇతర కొత్త నోట్ల మాదిరిగానే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రూ. 100 కన్నా ఇది చిన్నదిగా ఉంటుంది. కొత్త వంద నోట్లు పలు సెక్యూరిటీ ఫీచర్స్ తో తయారు అవుతున్నాయని, త్వరలోనే మార్కెట్లోకి వస్తాయని వెల్లడించిన అధికారులు, కొత్తవి వచ్చినా పాత కరెన్సీ కూడా చెల్లుబాటులో ఉంటుందని అధికారులు వెల్లడించారు.

Similar News