Union Minister Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, ప్రతిష్టాత్మక పార్లమెంట్ నాయకుడు శివరాజ్ పాటిల్ (90) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తన నివాసంలో కన్నుమూశారు.
Union Minister Shivraj Patil: కేంద్ర మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, ప్రతిష్టాత్మక పార్లమెంట్ నాయకుడు శివరాజ్ పాటిల్ (90) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం మహారాష్ట్రలోని లాతూర్‌లో తన నివాసంలో కన్నుమూశారు.
శివరాజ్ పాటిల్ లాతూర్ నుంచి ఏకంగా ఏడు సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 2004 నుంచి 2008 వరకు ఆయన కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అంతకుముందు, 1991–1996 మధ్య 10వ లోక్‌సభ స్పీకర్‌గా సేవలు అందించారు. పంజాబ్ గవర్నర్‌గా, అలాగే 2010–2015 మధ్య చండీగఢ్ యూనియన్ టెర్రిటరీ అడ్మినిస్ట్రేటర్‌గా కూడా పనిచేశారు.
లాతూర్ నుంచి ఎదిగిన అరుదైన నాయకుడు
1935 అక్టోబర్ 12న జన్మించిన శివరాజ్ పాటిల్, లాతూర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1970లలో ఎమ్మెల్యేగా విజయంతో రాష్ట్ర రాజకీయాల్లో తన స్థానం చాటుకున్నారు. తరువాత లోక్‌సభకు ఏడు సార్లు గెలిచారు. అయితే 2004లో బీజేపీ అభ్యర్థి రూపాతాయ్ పాటిల్ నిలంగ్‌కర్ చేతిలో ఓటమి ఎదుర్కొన్నారు.
శివరాజ్ పాటిల్ తన వ్యక్తిగత నైతిక విలువలు, ప్రశాంత స్వభావం, శుభ్రమైన రాజకీయ కోణం కోసం ప్రసిద్ధి పొందారు. ప్రత్యర్థులపై వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం ఆయన ప్రత్యేకత అని సహచరులు గుర్తుచేసుకుంటున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
శివరాజ్ పాటిల్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “నైతిక విలువలతో, హుందా రాజకీయాలతో ప్రజలకు ఆదర్శంగా నిలిచిన శివరాజ్ పాటిల్ గారి మృతి దేశానికి, కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం,” అని తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం లోక్‌సభ స్పీకర్‌గానూ, కేంద్ర హోం మంత్రిగానూ మరపురాని సేవలు అందించిందని సీఎం పేర్కొన్నారు.