IndiGo: సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు రూ.10 వేలు ట్రావెల్ వోచర్లు ప్రకటించిన ఇండిగో
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల ఎదుర్కొన్న పైలట్ల కొరత, సాంకేతిక సమస్యల నేపథ్యంలో పలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
IndiGo: సర్వీసుల రద్దుతో ఇబ్బంది పడ్డ ప్రయాణికులకు రూ.10 వేలు ట్రావెల్ వోచర్లు ప్రకటించిన ఇండిగో
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఇటీవల ఎదుర్కొన్న పైలట్ల కొరత, సాంకేతిక సమస్యల నేపథ్యంలో పలు సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు ఇండిగో కార్యకలాపాలు మళ్లీ పూర్తిస్థాయిలో గాడిన పడుతున్నాయని సంస్థ వెల్లడించింది. గురువారం రోజు నడపనున్న 1,950కిపైగా సర్వీసుల్లో మొత్తం మూడు లక్షల మంది ప్రయాణించనున్నట్లు తెలిపింది.
ఇబ్బందులకు గురైన వారికి పరిహారం
డిసెంబర్ 3 నుంచి 5 మధ్య ఇండిగో సర్వీసులు రద్దు కావడంతో అనేక మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టుల్లో గంటల తరబడి చిక్కుకుపోయారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నేపథ్యంలో, ఆ ఇబ్బందులు పడిన ప్రయాణికుల కోసం ఇండిగో రూ.10,000 విలువైన ట్రావెల్ వోచర్లను పరిహారంగా ప్రకటించింది.
అయితే ఎవరు అర్హులు, ఎంపిక ఎలా చేస్తారు అన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. ఈ వోచర్లను రాబోయే 12 నెలల్లో ఇండిగో ప్రయాణాల్లో ఉపయోగించవచ్చని తెలిపింది.
సర్వీసులు క్రమంగా సాధారణ స్థితికి
“మా కార్యకలాపాలు వేగంగా కోలుకుంటున్నాయి. ఈ రోజు మా సర్వీసులు నెట్‌వర్క్‌లోని 138 గమ్యస్థానాలకు అనుసంధానంగా నడుస్తాయి” అని సంస్థ స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.
ఇక వాతావరణం, సాంకేతిక సమస్యలు, నియంత్రణ సంబంధిత అంశాల వల్లే కొద్ది సంఖ్యలో విమానాలు మాత్రమే రద్దవుతున్నాయని పేర్కొంది.
గత వారం రోజులలోనే వందల సంఖ్యలో సర్వీసులు రద్దు కావడంతో కేంద్ర ప్రభుత్వం సైతం సీరియస్‌గా స్పందించి దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 9న ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ కూడా “మా సేవలు నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్నాయి” అని ప్రకటించారు.
సాధారణ పరిస్థితుల్లో ఇండిగో రోజుకు 2,200కిపైగా సర్వీసులు నడుపుతుందని సంస్థ గుర్తుచేసింది.