పోలింగ్‌ బూత్‌కు తాళం

Update: 2018-12-07 09:06 GMT

సూర్యాపేట జిల్లాలో పోలింగ్ సిబ్బంది నిర్వాకంపై ఓటర్లు మండిపడుతున్నారు. పోలింగ్ జరుగుతున్న సమయంలో, క్యూలో భారీ ఎత్తున ఓటర్లు ఉన్న తరుణంలో లంచ్ టైమ్ అయిందంటూ, పోలింగ్ బూత్ కు పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోయారు. సూర్యాపేటలోని తిరుమలగిరి మున్సిపాలిటీలోని బీసీ కాలనీ 291వ బూత్‌కి సిబ్బంది తాళం వేసి భోజనానికి వెళ్లడంతో రిటర్నింగ్ అధికారి సంజీవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం భోజన సమయంలో పోలింగ్ సిబ్బంది ఒకరి తర్వాత మరొకరు వెళ్లి భోజనం చేసి రావాల్సి ఉంటుంది. పోలింగ్ ప్రక్రియ ఆగిపోకుండా సిబ్బంది పని చేయాల్సి ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటర్లు ఏ క్షణంలో వచ్చినా, వారికి ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాల్సి ఉంటుంది. కానీ, ఇక్కడి పోలింగ్ సిబ్బంది తాళం వేసి వెళ్లిపోవడంతో ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో, పోలింగ్ సిబ్బంది మళ్లీ వచ్చి, తాళం తెరిచారు. 

Similar News