ఎమ్మెల్యే రోజాపై మండిప‌డ్డ కోటా శ్రీనివాస‌రావు

Update: 2018-01-08 18:36 GMT

  వైసీపీ ఎమ్మెల్యే రోజాపై న‌టుడు కోట శ్రీనివాస‌రావు మండిప‌డ్డారు. కొద్దిరోజుల క్రితం రోజా నిర్మాత బండ్ల‌గ‌ణేష్ ల మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రిగిన విష‌యం తెలిసిందే.  ఓ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో పాల్గొన్న రోజా-బండ్ల‌గ‌ణేష్ లు వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై స్పందించారు. ఆ స‌మ‌యంలో  వార‌స‌త్వ రాజ‌కీయాల‌పై జ‌గ‌న్ ను  ప‌వ‌న్ క‌ల్యాణ్  ప్ర‌శ్నించ‌డంపై వారి మధ్య మాటలు శ్రుతిమించాయి. వీరిద్దరి మధ్య చ‌ర్చ‌లు తారాస్థాయికి చేరుకున్నారు. ఒక‌రిపై ఒక‌రు దుమ్మెత్తిపోసుకున్నారు. ఆ వివాదంపై కోటా స్పందించారు. రోజాను ఓ రాజ‌కీయ నాయ‌కురాలిగా చూడ‌డంలేద‌ని అన్నారు. 
ఎందుకంటే, బండ్ల‌గ‌ణేష్ - రోజాల మ‌ధ్య విమ‌ర్శ‌ల్ని చూశాను. ఓ బాధ్యాయుత‌మైన ప‌ద‌విలో ఉన్న రోజా అలా మాట్లాడ‌కూడ‌ద‌ని , వాడంటే (బండ్ల గణేశ్) ఏదో కుర్ర వెధవ, పిచ్చోడిలా వాగాడు. రోజా అనుభవజ్ఞురాలు.  ఎమ్మెల్యేగా  ప‌నిచేస్తూ ఇలా మాట్లాడ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు.  ఆ అమ్మాయి గురించి నేనేమి వ్యక్తిగతంగా మాట్లాడటం లేదు. బయటకు కనపడుతున్నది అది!’ అని అన్నారు. 

Similar News