ఏపీకి కొత్త గవర్నర్‌గా కిరణ్ బేడీ ?

Update: 2018-03-25 09:32 GMT

ఏపీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో, ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించే యోచనలో ఉంది. ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్న కిరణ్ బేడీని ఏపీకి పంపాలనే యోచనలో కేంద్రం ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. తెలంగాణ గవర్నర్ గా మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరు కూడా కేంద్రం ప్రతిపాదనలో ఉన్నట్టు తెలుస్తోంది. పార్లమెంటు సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది.

ఏపీ, తెలంగాణా రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఉన్న నరసింహన్ హైదరాబాద్ లోనే ఎక్కువగా ఉండాల్సివస్తున్నందున ఏపీపై  పూర్తి స్థాయిలో దృష్టి నిలపలేకపోతున్నారని, అందువల్ల ఏపీకి కొత్త గవర్నర్ ని నియమించాలని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు కేంద్రానికి ఇటీవల లేఖ రాశారు. అటు-ఏపీకి నూతన గవర్నర్ గా కిరణ్ బేడీని నియమించవచ్చునని గతంలో కూడా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Similar News