మాజీ సీఎంకు శిక్ష ఖరారు

Update: 2017-12-16 06:20 GMT

బొగ్గు కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం మధు కోడాకు శిక్ష ఖరారైంది. మధు కోడాకు మూడేళ్లు జైలు శిక్ష విధిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జడ్జ్ భరత్ పరాషర్‌ తీర్పునిచ్చారు. మధు కోడాకు 25లక్షల జరిమానా కూడా విధించారు, బొగ్గు శాఖ కార్యదర్శి గుప్తా లక్ష రూపాయల జరిమానాతో పాటు మూడేళ్లు జైలు శిక్ష విధించింది. జార్ఖండ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఏకే బసులకు శిక్ష ఖరారు చేసింది. 
 

Similar News