ధోనీకోసం అభిమాని సాహసం..

Update: 2018-05-05 04:13 GMT

చెన్నై సూపర్ కింగ్స్ రధసారధి మహేందర్ సింగ్ ధోని కి అభిమానినుంచి ఊహించని ఘటన ఎదురైంది. గురువారం కోల్ కత్తా నైట్ రైడర్స్ , చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇందుకు ఇందుకు వేదికైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో పెవిలియన్ వద్ద ఉన్న ధోనీకోసం ఓ అభిమాని సాహసం చేశాడు. ప్రేక్షకుల స్థలి నుంచి పెన్సింగ్ దాటుకుని సెక్యూరిటీని సైతం లెక్కచేయకుండా ధోని వద్దకు వచ్చి కాళ్లకు నమస్కరించాడు. అసలేం జరుగుతుందో అర్ధం కానీ కానీ ధోని ఆ అభిమానిని ప్రేమతో దీవించి పంపాడు. దీంతో చుట్టుపక్కల ఉన్న మిగతా క్రికెటర్లు ధోని అంటే ఎంతప్రేమో అనుకునేంతల చర్చించుకున్నారు. ఈ హఠాత్ పరిణామాన్ని ఐపీఎల్ తనఅధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. అంతే రెండు రోజుల నుంచి ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది. 

Similar News