జెండా ఆవిష్కరణలో అపశృతి

Update: 2018-08-16 04:16 GMT

స్వాతంత్య్రదినోత్సవం రోజున న్యూఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో అపశృతి చోటుచేసుకొన్నది. పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా జాతీయజెండా ఆవిష్కరిస్తున్న సమయంలో పొరపాటున జెండా కిందికి జారింది. దీంతో వెంటనే తేరుకున్న షా.. జెండా తాడును వేగంగా లాగి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అధికారులు అక్కడి పరిస్థితిని చక్కదిద్దారు. జెండా ఆవిష్కరణ అనంతరం షా జాతీయ జెండాకు కాకుండా మరోవైపు తిరిగి సెల్యూట్‌ చేశారు. ఈ ఘటనపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించాయి. జాతీయ పతాకం కిందకు పడిపోవడంపై కాంగ్రెస్‌ పార్టీ స్పందిస్తూ.. ‘జాతీయ జెండాను సరిగ్గా ఆవిష్కరించలేని వాళ్లు దేశాన్ని ఏం పాలిస్తారు? గత 50 ఏళ్లుగా జాతీయ జెండాను గుర్తించడానికి వారు తిరస్కరించి ఉండకపోతే.. ఇవాళ జాతీయ పతాకం ఇలా నేలపై పడిపోయేదే కాదు’ అని ట్వీట్‌ చేసింది.


 

Similar News