కలెక్టర్లు, ఎస్పీలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

Update: 2018-05-05 06:35 GMT

కలెక్టర్లు, ఎస్పీలు, వివిద శాఖల అధికారులతో ఉదయం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. దాచేపల్లి అత్యాచార ఘటనను నిరశిస్తూ సోమవారం ఉదయం, సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. NCC, NSS కు చెందిన విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొనేలా చూడాలని చెప్పారు. అలాగే దాచేపల్లి ఘటనపై డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించిన చంద్రబాబు..ఈ కేసును డీల్ చేయడంతో పోలీసుల కృషి, నిందితుడి ఆత్మహత్య, ప్రజల అభిప్రాయాలు డాక్యుమెంటరీలో ప్రతిబింబించాలని సూచించారు. 
సమాజంలో జరుగుతున్న అకృత్యాల గురించి డ్వాక్రా మహిళలు, సాధికార మిత్రులు, ప్రజలను చైతన్య పరచాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. అత్యాచార ఘటనల నుంచి కూడా రాజకీయ లబ్ది పొందాలని చూడటం హేయమన్నారు. తప్పుడు పనులు, తప్పుడు రాజకీయాలకు పాల్పడితే సహించేది లేదని సీఎం హెచ్చరించారు. నిందితుడి పార్టీ నేతలే ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరమన్న సీఎం ఇలాంటి పార్టీలు , నేతలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.   

Similar News