వెయ్యి కిలోల కుక్క మాంసం పట్టుకున్న అధికారులు

Update: 2018-11-17 14:56 GMT

తమిళనాడులో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది. ఓ పార్శిల్‌ లో దాదాపు 1000 కిలోల కుక్కమాంసం బయటపడింది. ఈ ఘటన ఎగ్మోర్ రైల్వే స్టేషన్ లో వెలుగుచూసింది. రైల్వే స్టేషన్ లోని ఐదో నంబర్‌ ప్లాట్‌ఫాంపై ఓ భారీ అనుమానాస్పద పార్శిల్‌ ను ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులతో రైల్వే స్టేషన్ కు వచ్చిన పోలీసులు ఆ పార్సిల్ ను తెరచి చూశారు. అందులో మాంసం కనిపించేసరికి వారు షాక్ కు గురయ్యారు. దాదాపు 1000 కిలోల కుక్క మాంసంగా భావించిన ఫుడ్‌ సెక్యూరిటీ అధికారులు పరీక్షల నిమిత్తం దానిని ల్యాబ్‌కు తీసుకువెళ్లారు. ఇదిలావుంటే రాజస్తాన్‌ నుంచి చైన్నై బయల్దేరిన జోధ్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కుక్క మాంసాన్ని స్మగ్లింగ్‌ చేస్తున్నారని  చెన్నై పోలీసులకు ముందుగానే సమాచారం అందినట్టు తెలుస్తోంది. 

Similar News