ఈ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం నిలిపివేయాలి..

Update: 2018-12-04 15:30 GMT

తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 5న సాయంత్రం 5 గంటల నుంచి ప్రచారం నిలిపివేయాలని ఆదేశించారు ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌. సాయంత్రం 5 గంటల తరువాత బహిరంగ సభలు, రోడ్ షో లు నిర్వహించడం నిషిద్ధమని అయన తెలిపారు. అయితే  అసిఫాబాద్‌, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం, సిర్పూర్‌, బెల్లంపల్లి, చెన్నూర్‌, మంచిర్యాల నియోజకవర్గాల్లో డిసెంబర్‌ 5న సాయంత్ర నాలుగు గంటలకే ప్రచారం నిలిపివేయాలని తెలిపారు. అలాగే సందేశాలు ప్రసారం,  ఒపీనియన్‌ పోల్స్‌ సర్వేలు, ఇతరాత్ర కార్యక్రమాలు ప్రసారం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 126 ప్రకారం  రెండేళ్ల జైలు శిక్ష, లేదా జరిమానా విధించే అవకాశం ఉందని వివరించారు.

Similar News