కిడారి, సోమ హత్యలపై చర్యలకు రంగం సిద్ధం..

Update: 2018-09-29 05:38 GMT

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరిను మావోయిస్టులు హత్య చేసిన ఘటనపై ప్రభుత్వం మరిన్న చర్యలుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే డుంబ్రిగుడ ఎస్‌ఐ అమ్మన్‌ రావును సస్పెండ్‌ చేసిన పోలీసులు ఉన్నతాధికారులు తాజాగా అరకు సీఐ వెంకునాయుడు సస్పెన్షన్‌కు రంగం సిద్ధం చేశారు. ఇవాళో  రేపో సీఐ వెంకు నాయుడుకు సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్లు సమాచారం. కొంతకాలంగా డుంబ్రిగుడ పోలీస్ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సంచరిస్తున్నా సమాచారం రాబట్టలేకపోవడాన్ని తీవ్ర వైఫల్యంగా భావిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు ఒక్కొక్కరిపై శాఖాపరమైన చర్యలు తీసుకొంటున్నారు. అలాగే అరకు ఘటనపై సంబంధించి మరికొందరు పోలీసు అధికారుల్ని బదిలీ చేసే యోచనలో ఉన్నట్లు  సమాచారం 

Similar News