గజల్‌ కేసులో మరో ట్విస్ట్‌.. హెచ్ఎంటీవీ చేతిలో మరో ఎక్స్‌క్లూజివ్ విజువల్

Update: 2018-01-03 08:03 GMT

గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో.. హెచ్ఎంటీవీ చేతికి మరో ఎక్స్‌క్లూజివ్ విజువల్ దొరికింది. గజల్ గదిలోకి బాధితురాలు కుమారిని.. ఏ2 నిందితురాలు పార్వతి పిలుస్తున్న విజువల్స్ మనం ఇప్పుడు ఎక్స్‌క్లూజివ్‌గా హెచ్ఎంటీవీ స్క్రీన్‌పై చూస్తున్నాం. శ్రీనివాస్‌కు మసాజ్ ఎలా చేయాలన్నది.. దగ్గరుండి కుమారికి చూపించింది పార్వతి. 

కుమారిని ప్రలోభపెట్టి.. భయపెట్టి మరీ.. గజల్ శ్రీనివాస్‌కు మసాజ్ చేయించింది పార్వతి. ఇప్పుడు ఆ విజువల్స్.. ఎక్స్‌క్లూజివ్‌గా హెచ్ఎంటీవీ స్క్రీన్‌పై చూస్తున్నాం. గజల్ శ్రీనివాస్ గలీజు వ్యవహారంలో.. నిన్న టీజర్ మాత్రమే రిలీజైతే.. ఇవాళ ట్రైలర్స్ బయటికొస్తున్నాయి. ఒక్కొక్కటిగా.. శ్రీనివాస్ ఆగడాలు బయటపడుతున్నాయి.

ఇవి మాత్రమే కాదు.. ప్రసారం చేయటానికి కూడా వీల్లేని విధంగా ఉన్నాయి గజల్ శ్రీనివాస్, అతని పీఏ పార్వతి వేషాలు. గది బయట ప్రపంచానికి ఒకలా.. గది లోపల మరోలా ఉంటాడు శ్రీనివాస్. బాధితురాలు కుమారి.. ముసుగు తీసిన గజల్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. మసాజ్ పేరుతో.. గజల్ శ్రీనివాస్ వేసిన వేషాలెన్నో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే అవి బయటకు వస్తున్నాయి.

ఈ కేసుకు సంబంధించి.. ఆలయవాణి రేడియోలో ఇంతకుముందు పనిచేసిన మహిళా ఉద్యోగులను కూడా పోలీసులు విచారించనున్నారు. వారితో కూడా శ్రీనివాస్ ఇలాగే ప్రవర్తించాడా..? అతడు ఎంతమందిని వేధించాడు.? ఇంకెవరితోనైనా మసాజ్ చేయించుకున్నాడా.? లేదా.? అన్న విషయాలను బయటకు తీయనున్నారు. గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపుల కేసులో.. ఏ2 నిందితురాలు పార్వతి ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె దొరికిన వెంటనే.. పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Similar News