అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే పనిలో సీఎం చంద్రబాబు

Update: 2018-07-18 11:52 GMT

అవిశ్వాసంపై చర్చకు లోక్‌సభ స్పీకర్ అనుమతించడంతో టీడీపీ ఢిల్లీ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే సీఎం చంద్రబాబు అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే పనిలో బిజీబిజీగా ఉన్నారు. బీజేపీ, కాంగ్రెసేతర పార్టీ అధినేతలతో బాబు మంతనాలు సాగిస్తున్నారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఏపీకి జరిగిన అన్యాయంపై అందరికీ వివరిస్తున్నారు. ఇప్పటికే నరేంద్రమోడీ సర్కార్‌పై అవిశ్వాసానికి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, ఆర్‌ఎస్పీ, ఆప్‌, ఎస్పీ, ఎన్సీపీ, టీఎంసీ, ఆర్జేడీ మద్దతు తెలిపాయి. ఐతే టీఆర్ఎస్ మాత్రం టీడీపీ అవిశ్వాసంపై తటస్థంగా ఉంది. ఇదిలా ఉంటే పార్టీ ఎంపీలకు టీడీపీ 3 లైన్ల విప్ జారీ చేసింది. శుక్ర, సోమవారాల్లో లోక్‌సభ, రాజ్యసభలకు తప్పనిసరిగా హాజరుకావాలని తెలిపారు. పార్టీ నిబంధనలకు అనుగుణంగా నడచుకోవాలని విప్ జారీ చేశారు.
 

Similar News