బ్యాంకులకు వరుస సెలవులు.. నగదు కోసం..

Update: 2018-11-21 03:09 GMT

ఈ వారంలో బ్యాంకులకు వరుస సెలవులు ఉన్నాయి. పండగలు, సాధారణ సెలవుల కారణంగా పనిచేసే ఆరు రోజుల్లో 4 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బుధవారం(నేడు) ఈద్‌-ఇ-మిలాద్‌-ఉల్‌-నబీ కాగా, శుక్రవారం గురునానక్‌ జయంతితో పాటు కార్తీక పౌర్ణమి కూడా ఉంది. ఇక వారాంతమైన 24, 25 తేదీలు ఎలాగూ నాలుగో శనివారం, ఆదివారం సాధారణ  సెలవు దినాలనే విషయం తెలిసిందే. కేవలం ఒక గురువారం మాత్రమే బ్యాంకులు పనిచేయనుండటంతో.. ప్రజలు ఏటీఎంలవైపు పరుగులు పెడుతున్నారు. నాలుగు రోజులపాటు బ్యాంకులకు సెలవులు ఉండటంతో ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది.  బ్యాంకులు మూతపడనున్న నేపథ్యంలో సరిపడేంత నగదు విత్‌డ్రా చేసుకొని పెట్టుకోవదానికి జనం పోటీపడుతున్నారు. కాగా భోపాల్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లోని బ్యాంకులకు కేవలం బుధ, శనివారాల్లో మాత్రమే సెలవులు ఇచ్చారు.

Similar News