పోస్తే రూ.100 పడుద్ది..

Update: 2018-12-19 04:28 GMT

బహిరంగ మూత్రవిసర్జన నివారణకు జీహెచ్‌ఎంసీ ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. దాంతో ఇకనుంచి కఠినంగా వ్యవహరించడానికి  సిద్ధమైంది. అలాగే రోడ్లపై చెత్తవేసే వారిపై కూడా చర్యలకు ఉపక్రమించింది.  వచ్చేనెల 4వ తేదీనుంచి నెలాఖరువరకు స్వచ్ఛసర్వేక్షన్‌– 2019 ర్యాంకుల్ని ప్రకటించేందుకు స్వచ్ఛ భారత్‌మిషన్‌ ప్రతినిధుల బృందం హైదరాబాద్ నగరంలో పర్యటిస్తున్నారు. దాంతో ర్యాంకింగ్‌ కోసం జీహెచ్‌ఎంసీ భారీ జరిమానాలు విధించేందుకు సిద్ధమవుతోంది. బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేసేవారికి రూ.100 జరిమానా విధించాలని నిర్ణయించింది. అలాగే చెత్తకుండీలో కాకుండా బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేస్తే మాత్రం రూ.1000 జరినామా కట్టాల్సి ఉంటుంది. అంతేకాకుండా రోడ్లపై పెద్దమొత్తంలో చెత్త వేస్తే రూ. 2వేలు, చెత్తకుండీల్లో కాకుండా చెత్తకుండీ పక్కన చెత్తవేస్తే రూ.100, పెద్దమొత్తంలో వ్యర్ధ పదార్ధాలను రోడ్లపై వేస్తే రూ.10 వేలు, నాలాల్లో వ్యర్థాలు, చెత్త వేస్తే అక్షరాలా 10 వేల రూపాయలు సమర్పించుకుని రావలసిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అందుకని అందరూ జాగ్రత్తగా వ్యవహరించండి. 

Similar News