Zomato: పోషకాహారం కోసం.. జొమాటోలో కొత్త ఫీచర్‌

Zomato: పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునేందుకు వీలుగా జొమాటో సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది.

Update: 2025-09-29 09:38 GMT

Zomato: పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునేందుకు వీలుగా జొమాటో సరికొత్త ఫీచర్‌ను ప్రారంభించింది. 'హెల్తీమోడ్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌లో, వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను వాటి పోషక విలువలతో కూడిన రేటింగ్‌ ఆధారంగా ఎంపిక చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్‌ను జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ద్వారా ప్రకటించారు.

ప్రతి వంటకానికి ఓ స్కోర్

‘‘ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం గురించి వినియోగదారులకు తెలియజేయాలనే లక్ష్యంతో ఈ ఫీచర్ తీసుకొచ్చాం. 'హెల్తీమోడ్'లో ప్రతి వంటకానికి ఒక స్కోర్ ఉంటుంది. ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియంట్స్ ఆధారంగా ఈ స్కోర్ 'లో' నుంచి 'సూపర్' వరకు ఉంటుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ గురుగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఇతర నగరాలకు విస్తరిస్తాం. మా లక్ష్యం 'బెటర్ ఫుడ్ ఫర్ మోర్ పీపుల్'కు ఇది దగ్గరగా ఉంటుందని భావిస్తున్నాను’’ అని దీపిందర్ గోయల్ తెలిపారు.

Tags:    

Similar News