Google: దయచేసి వెళ్లిపోండి.. ఉగ్యోగులపై గూగుల్ సంచలన నిర్ణయం
Google AI Shift: గూగుల్ లాంటి టెక్ దిగ్గజంలో ఉద్యోగం అంటే అదొక కల. కానీ, మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ ప్రపంచంలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి.
Google: దయచేసి వెళ్లిపోండి.. ఉగ్యోగులపై గూగుల్ సంచలన నిర్ణయం
Google: గూగుల్ లాంటి టెక్ దిగ్గజంలో ఉద్యోగం అంటే అదొక కల. కానీ, మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీ ప్రపంచంలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవం పాత పద్ధతులకు చెక్ పెడుతూ, కొత్త సవాళ్లను విసురుతోంది. ఈ క్రమంలో గూగుల్ తీసుకున్న తాజా నిర్ణయం ఇప్పుడు ఐటీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది.
ఏఐ వేగం.. గూగుల్ కొత్త మార్గం
గూగుల్ తన వ్యాపార శైలిని పూర్తిగా ఏఐ మయం చేయాలని భావిస్తోంది. ఈ ప్రయాణంలో భాగంగా, భవిష్యత్తు ఏఐ ప్రణాళికలకు అనుగుణంగా అప్‌డేట్ అవ్వని లేదా సిద్ధంగా లేని ఉద్యోగుల కోసం స్వచ్ఛంద నిష్క్రమణ ప్యాకేజీ ప్రకటించింది. ప్రధానంగా గ్లోబల్ బిజినెస్ ఆర్గనైజేషన్ విభాగంలోని ఉద్యోగులకు. ఈ విభాగం కంపెనీ యాడ్స్, అంతర్జాతీయ అమ్మకాలు, ఆదాయ మార్గాలను పర్యవేక్షిస్తుంది.కస్టమర్ సేల్స్ , కస్టమర్ ఫేసింగ్ పొజిషన్లలో ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తించదు. గూగుల్ తన కార్యకలాపాలను ఏఐ ఆధారితంగా మార్చుకోవాలని నిర్ణయించుకోవడమే.
లాభాల్లో ఉన్నా.. లేఆఫ్స్ ఎందుకు?
సాధారణంగా నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ గూగుల్ కథ వేరు. 2025లో గూగుల్ ఏకంగా 400 బిలియన్ డాలర్ల భారీ ఆదాయాన్ని ఆర్జించింది. ఇంత లాభాల్లో ఉన్నా ఉద్యోగులకు ఉద్వాసన పలకడం వెనుక ఉన్నది ఖర్చు తగ్గించుకోవడం కంటే నైపుణ్యాన్ని మార్చుకోవడం అనే చెప్పాలి.భవిష్యత్తు అంతా ఏఐ దే. టెక్నాలజీ మారుతున్నప్పుడు, ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోలేని వారు వెనుకబడిపోతారు.
ఇదే గూగుల్ తన ఉద్యోగులకు ఇస్తున్న సంకేతం. కేవలం గూగుల్ మాత్రమే కాదు.. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా వంటి కంపెనీలు కూడా తమ సీనియర్ ఉద్యోగులకు ఇలాంటి గోల్డెన్ హ్యాండ్‌షేక్ ఆఫర్లను ఇచ్చాయి. టెక్ ప్రపంచంలో నెట్టుకురావాలంటే అనుభవంతో పాటు అప్‌డేటెడ్ స్కిల్స్ కూడా ఉండాలని ఈ పరిణామాలు హెచ్చరిస్తున్నాయి.